TALRadio Telugu
TALRadio Telugu
Touch A Life Foundation
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
నేను చదవాలనుకున్న వాటినే కథలుగా రాశాను! | Ramesh Karthik Naik | CHARCHA With Real Leader - 14
"నేను చదవాలనుకున్న పుస్తకం ఎక్కడా కనిపించలేదు… అందుకే దాన్ని నేనే రాశాను…"అంటూ బంజారా సంస్కృతిని, జీవన విధానాన్ని తన రచనల ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.. రమేశ్ కార్తీక్ నాయక్!తమ ప్రజల జీవితం, సంస్కృతి గురించి చెప్పే కథలు చాలా తక్కువగా కనిపించడంతో... వాటిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రచనలు చేయడం ప్రారంభించారు.తండాల్లోని జీవితం, అక్కడి మనుషులు, వారి అనుభవాలను తన కథల ద్వారా పాఠకులకు చేరవేస్తూ... తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆ ప్రయాణంలోనే యువ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి బంజారా రచయితగా నిలిచారు..!తన బాల్యం గురించి, హాస్టల్ జీవితం గురించి, తెలంగాణ ఉద్యమం, సాహిత్య ప్రయాణం వెనుక ఉన్న కథలను గురించి ఈ పాడ్కాస్ట్ ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...రమేశ్ కార్తీక్ నాయక్ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!“I couldn't find the book I wanted to read… so I wrote it myself.”With this thought, Ramesh Karthik Naik set out to bring the culture, traditions, and way of life of the Banjara community to a wider audience through his writings.Noticing that very few stories reflected the lives and experiences of his people, he began writing with the intention of documenting and sharing their rich heritage. Through his stories, he has introduced readers to life in the tandas, the people who live there, and their unique experiences, earning a distinct place in Telugu literature.In this journey, he became the first Banjara writer to receive the Yuva Sahitya Akademi Award.In this podcast, he shares fascinating insights into his childhood, hostel life, involvement in the Telangana movement, and the story behind his literary journey.In “Charcha With Real Leaders,” presented by TALRadio in partnership with South India’s CSR Summit, Ramesh Karthik Naik opens up about his inspiring journey in his own words.Guest: Ramesh Karthik NaikHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #RameshKarthikNayak #Banjara #BanjaraCulture #BanjaraLiterature #TeluguLiterature #TeluguWriter #SahityaAkademi #YuvaSahityaAkademi #AuthorJourney #Storyteller #TouchALifeFoundation
Jul 24
31 min
Rich Mindset Vs Poor Mindset | Smart Money Mindset Telugu - 2
ఒకే జీతం, ఒకే ఉద్యోగం... అయినా కొందరు ధనవంతులు అవుతారు, మరికొందరు అదే స్థాయిలో ఉండిపోతారు.. ఎందుకు?అదృష్టమా? తెలివితేటలా? లేక ఇంకేదైనా కారణమా?ఈ ప్రశ్నకు సమాధానం వారి ఆలోచనా విధానంలోనే ఉంటుందట!మనలో చాలామంది చేసే చిన్న చిన్న ఆర్థిక పొరపాట్లు ఏమిటి? కొందరు అవకాశాలను చూసి ముందుకు వెళ్తే, మరికొందరు వెనుకడుగు వేస్తుంటారు.. ఎందుకు? ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!అలాగే జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, తొందరపడకుండా ఓపికగా ఉండటం ఎంత ముఖ్యమో కూడా వివరించారు.డబ్బు గురించి మీ ఆలోచనా విధానాన్ని మార్చే వీరి మాటలను తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!How is it that two people with the same job and the same salary can end up in completely different financial situations? While one becomes financially successful, the other remains stuck in the same place. Why does this happen?Is it luck? Intelligence? Or is there something else behind it?According to experts, the answer often lies in our mindset and the way we think about money.What are some of the common financial mistakes many of us make? Why do some people recognize opportunities and move forward while others hesitate and miss them? What habits can help us earn, manage, and grow our money more effectively?In this episode of the Smart Money Mindset – Telugu podcast, renowned financial advisor Madhavi Latha shares valuable insights on these topics and much more.She also explains why continuous learning, patience, and a long-term perspective are essential for personal and financial growth.Don’t miss this insightful conversation that could transform the way you think about money and success.Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu#TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MoneyMindset #RichMindset #WealthBuilding #FinancialLiteracy #PersonalFinance #MoneyManagement #FinancialFreedom #WealthCreation #InvestmentMindset #PassiveIncome #SuccessHabits #FinancialPlanning #MindsetMatters #SelfGrowth #SmartMoney #TALRadio #TouchALifeFoundation
Jul 23
11 min
రచయిత రాసే ప్రతి పదం సమాజ శ్రేయస్సును ఆశించాలి! | మన రచయితలు | Dr. Vivekananda Murthy | Season - 2 | Episode - 5
వైద్యుడిగా ప్రాణాలు కాపాడుతున్నారు…రచయితగా మనసులను తాకుతున్నారు…విదేశాల్లో ఉంటూ కూడా తెలుగు భాషకు జీవితాన్నే అంకితం చేశారు… డా. వివేకానంద మూర్తి గారు!పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ వరకు సాగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వైద్యుడిగా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకుంటూనే, రచయితగా, నటుడిగా, మిమిక్రీ కళాకారుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు.యూకేలో స్థిరపడిన తర్వాత కూడా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి దూరం కాకుండా అక్కడి తెలుగు సమాజంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాణం పోశారు.రచయితగా ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? డాక్టర్‌గా ఉంటూనే సాహిత్యం, నటన రంగాల్లో ఎలా ముందుకు వెళ్తున్నారు? ప్రముఖ రచయితలతో వారికి ఉన్న అనుభవాలేమిటి? యూకేలో ఉంటూ తెలుగు కోసం ఆయన చేసిన సేవలేమిటి?ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా డా. వివేకానంద మూర్తి గారు మనతో పంచుకున్నారు...తప్పకుండా వినండి...మిస్ అవ్వకండి!As a doctor, he saves lives.As a writer, he touches hearts.Even while living abroad, he has dedicated his life to the promotion of the Telugu language and culture Dr. Vivekananda Murthy.His journey from West Godavari district in Andhra Pradesh to the United Kingdom is truly inspiring. While building a successful career as a medical professional, he has also made a remarkable mark as a writer, actor, mimicry artist, and cultural ambassador.Even after settling in the UK, he has remained deeply connected to Telugu language, literature, and culture, playing a vital role in organizing and promoting literary and cultural activities within the Telugu community there.How did his journey as a writer begin? How does he balance his medical profession with his passion for literature and acting? What memorable experiences has he had with renowned writers? And what contributions has he made toward preserving and promoting Telugu language and culture in the UK?Dr. Vivekananda Murthy shares these fascinating insights and many more in this week's episode of the Mana Rachayithalu podcast.Guest: Dr. Vivekananda MurthyHost: Renu Sree#TALRadioTelugu #ManaRachayithalu #DrKVivekanandaMoorthy #TeluguLiterature #PravasaTelugu #UKTelugu #TeluguWriter #TeluguCulture #MimicryArtist #TeluguLanguage #ManaRachayithaluPodcast #TALRadio
Jul 23
30 min
ముఖంపై తెల్లమచ్చలు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 106
చర్మంపై తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయా?ముఖం, మెడ, చేతులు వంటి భాగాల్లో ఏర్పడే ఈ మచ్చలు చాలామందిలో ఆందోళనను కలిగిస్తుంటాయి.అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఫంగల్ ఇన్ఫెక్షన్లు, విటమిన్ లోపాలు, చర్మ గాయాలు, జన్యుపరమైన కారణాలు లేదా విటిలిగో వంటి సమస్యలతో వీటికి సంబంధం ఉందా?ఆయుర్వేదం ప్రకారం... మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కోపం, భయం వంటి అంశాలు కూడా దీనికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.మరి తెల్ల మచ్చలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం, నిద్ర, జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? ఆయుర్వేదం ఈ సమస్యను ఎలా చూస్తుంది?ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వారం ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు.తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!Are white patches appearing on your skin?These patches, often seen on the face, neck, hands, and other parts of the body, can cause concern for many people.Why do they occur? Could they be linked to fungal infections, vitamin deficiencies, skin injuries, genetic factors, or conditions like vitiligo?According to Ayurveda, changing lifestyles, stress, anger, fear, and other emotional factors may also contribute to the problem.So, what precautions can help reduce white patches? What changes are needed in diet, sleep, and daily lifestyle? And how does Ayurveda view and manage this condition?In this week’s Ayurvedam Arogyam Podcast, renowned Ayurvedic physician Dr. Anupama Uppuluri shares valuable insights on these important topics.Don’t miss it... Tune in now!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #Vitiligo #WhitePatches #WhiteSpots #SkinHealth #Ayurveda #AyurvedicTreatment #AlternativeMedicine #MindBodyHealth #StressAndHealth #NutritionAndHealth #TeluguHealth #HealthcarePodcast #WellnessPodcast #IndianPodcast #PodcastLife #ListenNow #NaturalHealing #HealthPodcast #TeluguPodcast #AyurvedamArogyam #TALRadio #TouchALifeFoundation
Jul 22
31 min
పేదరికం నుండి పేద విద్యార్థులకు తోడుగా... | Maheshwaram Lakesh | CHARCHA With Real Leader - 13
ఒకప్పుడు రోజూవారి కూలీ కోసం పనిచేసిన ఓ విద్యార్థి... ఇప్పుడు వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు!పేదరికం, కుటుంబ కష్టాలు, చదువుకోడానికి చేసిన పోరాటం... ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిన మహేశ్వరం లకేష్ గారు, ఇప్పుడు Manu's HHOC ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి తోడుగా నిలుస్తున్నారు.తన చిన్ననాటి అనుభవాలు తనలోని సేవా గుణాన్ని ఎలా పెంచాయి? చదువు జీవితాన్ని ఎలా మార్చగలదు? అనాథ పిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, అత్యవసర సహాయం అవసరమైన వారికి ఎలా తోడుగా నిలుస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.ఒక వ్యక్తికి లభించిన అవకాశం... వేలాది మందికి ఆశగా ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పక వినండి.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...Manu's HHOC ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు లకేష్ మహేశ్వరం గారి స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!A student who once worked as a daily wage laborer to support his education... is now transforming the lives of thousands!Despite facing poverty, family hardships, and constant struggles to continue his studies, Maheshwaram Lokesh never gave up on his dreams. Today, through the Manu's HHOC Organization, he is making a meaningful difference in the lives of many people.How did his childhood experiences shape his passion for service? How can education change a person's life? How is he supporting orphaned children, elderly people, students, and those in urgent need of help? He shares these inspiring experiences and many more in this podcast.Don't miss this powerful conversation to learn how one opportunity in a person's life can grow into a source of hope for thousands.As part of the "Charcha With Real Leaders" series presented by TALRadio in association with South India’s CSR Summit...Listen to the inspiring service journey of Maheshwaram Lokesh, Founder of Manu's HHOC Organization, in his own words.Guest: Maheshwaram LokeshHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #LakeshMaheswaram #ManusHHOC #SocialService #NGO #NGOIndia #CommunityService #HelpingHands #InspiringJourney #RealLeaders #SupportTheNeedy #OrphanCare  
Jul 21
19 min
చిన్నప్పుడు చుట్టాలు వస్తే చాలా సంతోషంగా ఉండేది! | మా ఊరు - 78
అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు...వేసవి సెలవుల సందడి...చిన్నప్పుడు గడిపిన ఆ రోజులు ఎప్పటికీ ప్రత్యేకమే!అంటూ… ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో స్వరూప గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.విశాఖపట్నంలో జన్మించి, మహారాష్ట్రలో పెరిగి, హైదరాబాద్‌లో చదువుకుని, తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె... చిన్నప్పుడు తాతయ్య, అమ్మమ్మల ఊరిలో గడిపిన రోజులు, ఆ అనుభవాలు తన జీవితంపై చూపిన ప్రభావం, అప్పటి జీవన విధానం, నేటి తరాల్లో వస్తున్న మార్పుల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు.మన చిన్ననాటి జ్ఞాపకాలను, మన ఊరిని, మన మూలాలను మరోసారి గుర్తు చేసే ఈ అందమైన podcast ను తప్పక వినండి… మిస్ అవ్వకండి!Memories of grandmother’s village...The joy of summer vacations...Those childhood days remain special forever!In this week’s Maa Ooru program, Swaroopa Garu shares her cherished childhood memories and life journey with us. Born in Visakhapatnam, raised in Maharashtra, educated in Hyderabad, and later settled in the United States, she reflects on the memorable days she spent in her grandparents’ village and the lasting impact those experiences had on her life.She also talks about the lifestyle of those days, the values she learned growing up, and the changes she sees in today’s generation. This heartwarming podcast takes us back to our roots, our hometowns, and the memories that shaped who we are.Don’t miss this beautiful episode that will make you relive your childhood and reconnect with your origins!Guest: Swaroopa Host: Usha#TALRadio #MaaOoru #Swarupa #ChildhoodMemories #VillageLife #TeluguCulture #LifeJourney #TeluguPodcast #Nostalgia #TeluguStories
Jul 20
28 min
తల్లిదండ్రులు - పిల్లలు... మధ్య దూరం ఎందుకు? | Shazia Parveen | Health Talk
ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినడం లేదు?కుటుంబాల మధ్య దూరాలు ఎందుకు పెరుగుతున్నాయి?Generation Gap నిజంగానే సమస్యా...లేక ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే కారణమా?ప్రముఖ Psychologist, Global Trainer, Researcher షాజియా పర్వీన్ గారు ఈ అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో చెప్తూ… సమస్యల గురించి బాధపడటం కంటే వాటికి పరిష్కారాలు వెతకాలని, పిల్లలకు కేవలం లక్ష్యాలు మాత్రమే కాదు... మంచి Mentors, సరైన వాతావరణం కూడా అవసరమని చెప్పారు.కుటుంబ బంధాలు, పేరెంటింగ్, యువత భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఈ podcast ను తప్పక వినండి. మిస్ అవ్వకండి!Why are children today not listening to their parents?Why are distances growing within families?Is the generation gap really the problem, or is it simply a lack of understanding between one another?Renowned Psychologist, Global Trainer, and Researcher Shazia Parveen shares valuable insights on these important issues. She explains the importance of proper guidance for children and emphasizes that instead of worrying about problems, we should focus on finding solutions. She also highlights that children need not only goals but also good mentors and a supportive environment to thrive.This thought-provoking podcast explores family relationships, parenting, and the future of today’s youth. Don’t miss it!Guest: Shazia ParveenHost: Adarsh Kumar#TALRadio #SpecialInterview #ShaziaParveen #FamilyRelationships #Parenting #GenerationGap #YouthDevelopment #FamilyBonding #MentalHealth #TouchALifeFoundation 
Jul 20
28 min
సేవతోనే జీవితానికి సార్థకత | CHARCHA With Real Leader | Namratha Datta
కెరీర్‌ గ్రోత్‌తో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందాలంటే ఏం చెయ్యాలి?28 ఏళ్లకు పైగా కార్పొరేట్ రంగంలో పనిచేసిన నమ్రతా దత్తా గారు, ఉద్యోగ జీవితంలో వచ్చిన ఒత్తిడి, టెన్షన్ మధ్య ధ్యాన్ ఫౌండేషన్ ద్వారా యోగా, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేశారు. ఆ ప్రయాణం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, తన ఆలోచనలు మరియు జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసింది అనే విషయాలను ఈ పాడ్కాస్ట్‌లో మనతో పంచుకున్నారు.యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది మన మనసును, శరీరాన్ని, ఆలోచనల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని ఆమె వివరించారు. అలాగే ధ్యాన్ ఫౌండేషన్ చేపడుతున్న జంతు సంరక్షణ, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆహార పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాల గురించి కూడా ఆసక్తికర విషయాలను మనతో పంచుకున్నారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...ధ్యాన్ ఫౌండేషన్ వాలంటీర్, కార్పొరేట్ లీడర్ నమ్రతా దత్తా గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!How can we achieve mental peace along with career growth?With over 28 years of experience in the corporate world, Namratha Datta shares how she turned to yoga, spirituality, and selfless service through Dhyan Foundation while navigating the pressures and stress of professional life. In this podcast, she talks about the transformation this journey brought to her life, mindset, and overall approach to living.She explains that yoga is much more than physical exercise—it is a way of life that helps bring balance to the mind, body, and thoughts. She also shares insights into the impactful work of Dhyan Foundation, including animal welfare, education, environmental conservation, food distribution, and various humanitarian initiatives.As part of "Charcha With Real Leaders," presented by TALRadio in association with South India’s CSR Summit...Listen to the inspiring journey of Namratha Datta, Corporate Leader and Volunteer at Dhyan Foundation, in her own words.Guest: Namratha DattaHost: Vinil Reddy #TALRadio #CharchaWithRealLeaders #NamrathaDatta #DhyanFoundation #Yoga #Spirituality #Leadership #CorporateLeadership #SanatanaKriya #Mindfulness #PersonalGrowth #CSR #SouthIndiaCSRSummit #TeluguPodcast #InspiringLeaders #TALRadioTelugu
Jul 18
47 min
"ఆమె" కు అండగా సయోధ్య హోమ్ | CHARCHA With Real Leader - 12
"ఇక నా జీవితం ఇంతే" అని అనుకున్న ఎంతోమంది మహిళలకు..."ఇంకా జీవితం ఉంది" అనే నమ్మకాన్ని అందిస్తోంది ‘సయోధ్య హోమ్’…!గృహహింస, కుటుంబ సమస్యలు, అవమానాలు.. ఇలాంటి ఎన్నో కష్టాలతో జీవితంపై నమ్మకం కోల్పోతున్న మహిళలకు అండగా నిలుస్తూ... మళ్లీ ధైర్యంగా జీవించేలా చేస్తోంది…2010 నుంచి ఎంతో మంది మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ… ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనే తీరు.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ సంస్థ ఫౌండర్ మృదుల గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.ప్రతి మహిళ గౌరవంగా జీవించే హక్కుల గురించి ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...Sayodhya Home for Women వ్యవస్థాపకురాలు మృదుల గారి స్ఫూర్తిదాయక సేవా ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!For many women who felt, "This is the end of my life," Sayodhya Home has given a new hope... "There is still life ahead."Standing beside women facing domestic violence, family conflicts, emotional abuse, and difficult life situations, Sayodhya Home has been helping them rebuild their confidence and move forward with dignity.Since 2010, the organization has provided shelter and support to numerous women. In this podcast, Founder Ms. Mridula shares her journey, the experiences she has encountered, the challenges women face today, and the ways they can overcome them.Her thoughts on every woman's right to live with dignity and self-respect are truly thought-provoking.As part of "Charcha With Real Leaders", presented by TALRadio in association with South India’s CSR Summit, listen to the inspiring service journey of Ms. Mridula, Founder of Sayodhya Home for Women, in her own words.Guest: Mrudula VemulapatiHost: Vinil Reddy#TALRadio #CharchaWithRealLeaders #MrudulaVemulapati #SayodhyaHome #WomenEmpowerment #WomenRights #RealLeaders #WomenSupport #DomesticViolenceAwareness #WomenShelter #SocialImpact #SocialChange #WomenLeadership #InspiringWomen #WomenWithCourage #HopeAndHealing #TALRadioTelugu #TouchALifeFoundation
Jul 17
26 min
ఒక్క అడుగు... మీ ఆర్ధిక స్థితిని మార్చేస్తుంది! | Smart Money Mindset Telugu - 1
సంపాదన అంటే కేవలం డబ్బు చేతికి రావడం మాత్రమే కాదు... "నేను కూడా చేయగలను" అనే ధైర్యం రావడం, మన అవసరాలకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలగడం…!ఈరోజుల్లో చాలామంది మహిళలు, గృహిణులు, కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు తమ సమయాన్ని, శ్రమను అందరి కోసం కేటాయిస్తుంటారు. కానీ తమ సొంత ఆదాయం గురించి ఆలోచించినప్పుడు మాత్రం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియక ఆగిపోతారు.మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ మీ కోసమే!డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లాలి? ఇలాంటి ఎన్నో విషయాలపై ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు ఎన్నో ఉపయోగకరమైన సూచనలు అందించారు. అలాగే, తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే కొన్ని మంచి బిజినెస్ ఐడియాస్ ను కూడా మనతో పంచుకున్నారు.బహుశా మీరు వెతుకుతున్న ఆ అవకాశం ఈ పాడ్కాస్ట్ లోనే దొరకొచ్చు…మిస్ అవ్వకుండా వినండి మరి!Earning is not just about having money in your hands... it's about gaining the confidence to say, “I can do this too,” and being able to meet your own needs without depending on others.Today, many women, homemakers, and caregivers dedicate most of their time and effort to their families. But when it comes to earning their own income, they often don’t know where or how to begin.Have you ever felt the same way? Then this Smart Money Mindset - Telugu podcast is for you!In this episode, renowned financial advisor Madhavi Latha shares practical insights on managing money, spending wisely, building savings, and becoming financially independent. She also discusses several business ideas that can be started with a small investment.Who knows? The opportunity you’ve been looking for might be hidden in this conversation.Don’t miss this inspiring and informative podcast!Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MadhaviLatha #FinancialAdvisor #WomenEmpowerment #FinancialFreedom #FinancialLiteracy #MoneyManagement #SavingsTips #PersonalFinance #WomenInBusiness #BusinessIdeas #SmallBusinessIdeas #FinancialPlanning #WomenEntrepreneurs #Entrepreneurship #IncomeGeneration #TALRadio #TouchALifeFoundation
Jul 16
14 min
Load more