చిన్ననాటి జ్ఞాపకాలు.. మధురమైన అనుభవాలు!
గురజాడలో పుట్టి, రాయవరంలో పెరిగిన ప్రసాద్ కొలపల్లి గారి బాల్యం ఎన్నో గ్రామాలతో ముడిపడి ఉంది. చిన్నతనంలో వివిధ గ్రామాల్లో చదువుకుంటూ, ఎన్నో ప్రాంతాల జీవన విధానాలను దగ్గరగా చూసారు. ఆ అనుభవాలతోనే జీవితంలో ముందుకు సాగారు.
ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసి, తన కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగారు. మరోవైపు, పిల్లల చదువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ, వారు ఉన్నత చదువులు చదివి తమకు నచ్చిన రంగాల్లో స్థిరపడేలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆయన పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా, మనవలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు.
తన చిన్ననాటి జ్ఞాపకాలు, రాయవరం, మచిలీపట్నంతో ఉన్న అనుబంధం, అప్పటి పల్లె జీవితం, ఉద్యోగంలో ఎదురైన అనుభవాలు, పిల్లల చదువుల కోసం చేసిన కృషి.. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో మనతో పంచుకోనున్నారు ప్రసాద్ కొలపల్లి గారు!
ఆయన జీవితంలోని అనుభవాలను, పల్లె జ్ఞాపకాలను తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ ను తప్పక వినండి.. మిస్ అవ్వకండి!
Sweet Childhood Memories and Life Experiences!
Born in Gurajada and raised in Rayavaram, Prasad Kolapalli’s childhood was connected to several villages. Studying in different places helped him understand rural lifestyles and gain valuable life experiences.
While working, he completed his degree and gradually progressed in his career. He also prioritized his children’s education, encouraging them to pursue higher studies and build careers in their chosen fields. Today, his children work in the USA, and he enjoys spending quality time with his grandchildren.
In this week’s Maa Ooru program, Prasad Kolapalli shares his childhood memories, his connection with Rayavaram and Machilipatnam, village life in those days, his career experiences, and his efforts to support his children’s education.
Tune in to this podcast to explore his inspiring life journey and cherish the beautiful memories of rural life!
Guest: సీతా రామాంజనేయ ప్రసాద్ కొలపల్లి,
Seattle,USA
Host: Usha
#TALRadioTelugu #MaaOoru #ChildhoodMemories #VillageLife #LifeJourney #TeluguPodcast #TouchALife #TALRadio



