We In Christ
We In Christ
WIC
Psalms-4 Telugu Study Bible
1 minutes Posted Jan 2, 2021 at 2:43 pm.
0:00
1:51
Download MP3
Show notes

కీర్తన 4

ప్రధాన సంగీతకారుని కోసం, తీగవాయిద్యాలతో. దావీదు కీర్తన.

1నా నీతిన్యాయాలకు ఆధారమైన దేవా, నేను విజ్ఞప్తి చేసినప్పుడు నాకు జవాబివ్వు. ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత ఇవ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు.

2మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు?సెలా.

3యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకుంటాడని తెలుసుకోండి. నేను యెహోవాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు.

4భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడక మీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి.సెలా.

5నీతి సంబంధమైన బలులు అర్పించి యెహోవాలో నమ్మకం ఉంచండి.

6మాకు ఏదైనా క్షేమం కలిగించేది ఎవరు? అని అనేకమంది అంటారు. యెహోవా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశించు.

7ధాన్యం, కొత్త ద్రాక్షారసం పుష్కలంగా ఉన్న వారి ఆనందం కన్నా అధికమైన ఆనందం నువ్వు నా హృదయానికి ఇచ్చావు.

8యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.