
Telugu Audio
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Mar 31, 2022
11 min

1 ✽ఇది యేసు క్రీస్తు వంశావళి లేఖనం. ఆయన దావీదు కుమారుడు అబ్రాహాము కుమారుడు.
2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు✽. ఇస్సాకు కుమారుడు యాకోబు✽. యాకోబు కుమారులు యూదా, అతడి అన్నదమ్ములు✽.
3 యూదా కుమారులు పెరెసు, జెరహు. వారి తల్లి తామారు✽. పెరెసు కుమారుడు ఎస్రోన్. ఎస్రోన్ కుమారుడు ఆరామ్✽.
4 ఆరామ్ కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.
5 శల్మాను కుమారుడు బోయజు. బోయజు తల్లి రాహాబు✽. బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు✽. ఓబేదు కుమారుడు యెష్షయి.
6 యెష్షయి కుమారుడు దావీదురాజు.
దావీదు✽ కుమారుడు సొలొమోను✽. సొలొమోను తల్లి మొదట ఉరియా భార్య✽.
7 సొలొమోను కుమారుడు రెహబాం. రెహబాం కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా.
8 ✽ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం. యెహోరాం కుమారుడు ఉజ్జీయా.
9 ఉజ్జీయా కుమారుడు యోతాం. యోతాం కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా.
10 హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.
11 ✽యోషీయా కుమారులు యెకొన్యా, అతడి సోదరులు. వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది.
12 యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగిన తరువాత వీరు జన్మించారు: యెకొన్యా కుమారుడు షయల్‌తీయేల్. షయల్‌తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్.
13 జెరుబ్బాబెల్ కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీం. ఎల్యాకీం కుమారుడు అజోరు.
14 అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అకీం. అకీం కుమారుడు ఏలీహూదు.
15 ఏలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు.
16 ✽యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమెకు యేసు జన్మించాడు. యేసు బిరుదం “క్రీస్తు”.
17 ఈ విధంగా అబ్రాహామునుంచి దావీదువరకు పధ్నాలుగు తరాలు; దావీదు కాలంనుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్ళిన✽ కాలంవరకు పధ్నాలుగు తరాలు; బబులోనుకు తీసుకువెళ్ళిన కాలంనుంచి క్రీస్తువరకు పధ్నాలుగు తరాలు.
18 ✽ఇది యేసు క్రీస్తు జన్మ వివరణ: ఆయన తల్లి అయిన మరియకు యోసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ✽ మూలంగా గర్భవతి అని కనబడింది.
19 ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు✽, గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకొన్నాడు.
20 ✽అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే, ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలో కనబడి ఇలా అన్నాడు: “యోసేపు! దావీదు కుమారా! మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది.
21 ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపాలనుంచి విడిపించి రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు✽ అనే పేరు పెట్టాలి.”
22 ✽ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది:
23 “ఇదిగో వినండి, ఒక కన్య గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ‘ఇమ్మానుయేల్✽’ అని నామకరణం చేస్తారు.” ఇమ్మానుయేల్ అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.
24 ✽యోసేపు నిద్ర మేలుకొని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు.
25 అయితే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంతవరకు అతడు ఆమెను ముట్టలేదు. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Sep 29, 2021
6 min

రూతు 4
1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.౹
2 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.౹
3 అతడు–మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.౹
4 ఈ పురనివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు–నేను విడిపించెదననెను.౹
5 బోయజు–నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా
6 ఆ బంధువుడు— నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.౹
7 ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి గాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.౹
8 ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా
9 బోయజు —ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.౹
10 మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.౹
11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును–మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;౹
12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.౹
13 కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.౹
14 అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడులేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.౹
15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.౹
16 అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.౹
17 ఆమె పొరుగు స్త్రీలు–నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయియొక్క తండ్రి.
18 [18-19] పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,౹
19
20 నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,౹
21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Aug 8, 2021
6 min

రూతు 3
1 ఆమె అత్తయైన నయోమి–నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.౹
2 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.౹
3 నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.౹
4 అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా
5 ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
6 ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను.౹
7 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.౹
8 మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.౹
9 అతడు–నీ వెవరవని అడుగగా ఆమె— నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమనగా
10 అతడు–నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినేగాని గొప్పవారినేగాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీమునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.౹
11 కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.౹
12 నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు.౹
13 ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.౹
14 కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు–ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను.౹
15 మరియు అతడు–నీవు వేసికొనిన దుప్పటి తెచ్చిపట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరు కొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.౹
16 ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్త–నా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి
17 –నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చెననెను.౹
18 అప్పుడు ఆమె–నా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియువరకు ఊరకుండుమనెను.
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 28, 2021
4 min

రూతు 2
1 నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.౹
2 మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను.౹
3 కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.౹
4 బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.౹
5 అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా
6 కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు— ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు.౹
7 ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.౹
8 అప్పుడు బోయజు రూతుతో— నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.౹
9 వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.౹
10 అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.౹
11 నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.౹
12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను.౹
13 అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.౹
14 బోయజు–భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమెతిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.౹
15 ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు–ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి
16 మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను.౹
17 కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.౹
18 ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమెతిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను.౹
19 అంతట ఆమె అత్త ఆమెతో–నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.౹
20 నయోమి–బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి–ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా
21 మోయాబీయురాలైన రూతు–అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.౹
22 అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో–నా కుమారీ, అతని పనికత్తెలతోకూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.౹
23 కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 24, 2021
11 min

రూతు
1
1 నాయకులు ఇస్రాయేల్‌ప్రజను పరిపాలించే కాలం✽ లో దేశంలో కరవు✽ వచ్చింది. యూదా ప్రదేశంలో ఉన్న బేత్‌లెహేం పురవాసి ఒకడు తన భార్యనూ ఇద్దరు కొడుకులనూ తీసుకొని మోయాబుదేశంలో కొంత కాలం ఉండడానికి వెళ్ళాడు. 2 అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి✽ . అతని కొడుకుల పేర్లు మహలోను, కిల్యోను. వీరు యూదాలో ఉన్న బేత్‌లెహేంలో కాపురముండే ఎఫ్రాతావారు✽ . వారు మోయాబు✽ కు చేరి అక్కడ ఉండిపోయారు. 3 అక్కడ నయోమి భర్త ఎలీమెలెకు చనిపోవడంతో నయోమి, ఆమె ఇద్దరు కొడుకులు మిగిలారు. 4 ఆమె కొడుకులు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకొన్నారు. వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారంతా మోయాబులో పది సంవత్సరాలు కాపురం ఉన్నారు. 5 అప్పుడు మహలోను, కిల్యోను కూడా చనిపోయారు గనుక నయోమి తన భర్త, ఇద్దరు కొడుకులు లేకుండా ఉంది.
6 యెహోవా తన ప్రజను దయ చూచి వారికి భోజనం ప్రసాదించాడని✽ మోయాబులో నయోమికి వినబడింది గనుక ఆమె తన ఇద్దరు కోడళ్ళతోపాటు ఇస్రాయేల్ దేశానికి తిరిగి వెళ్ళడానికి✽ సిద్ధపడింది. 7 అప్పటివరకు కాపురమున్న స్థలాన్ని విడిచి ఆమె, ఆమె ఇద్దరు కోడళ్ళు యూదా ప్రదేశానికి పోయే దారిన బయలుదేరారు.
8 అప్పుడు నయోమి తన కోడళ్ళతో “మీరు మీ పుట్టిండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయినవారిమీద, నామీదా✽ మీరు దయ చూపారు. ఆ విధంగానే యెహోవా మీమీద దయ చూపుతాడు గాక! 9 మీరు మళ్ళీ పెండ్లి చేసుకొని మీ భర్తల గృహాలలో నెమ్మది పొందేలా యెహోవా ప్రసాదిస్తాడు గాక!” అని చెప్పి వారిని ముద్దుపెట్టుకొంది.
10 అప్పుడు వారు బిగ్గరగా ఏడుస్తూ “నీతో పాటే నీ ప్రజల దగ్గరికి వస్తాం” అన్నారు.
11 అందుకు నయోమి ఇలా అంది: “నా బిడ్డలారా, మీరు నాతో రావడం దేనికి? మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. మీకు భర్తలు✽ కావడానికి నా గర్భంలో ఇంకా కొడుకులున్నారా? 12 నా బిడ్డలారా, మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. మరో భర్తతో కాపురం చేయలేనంతటి ముసలిదానిని నేను. ఒక వేళ నాకు నమ్మకం ఉన్నా కూడా, ఈ రాత్రే భర్తతో గడపగలిగినా, తరువాత కొడుకులను కన్నా, 13 వారు పెరిగి పెద్దవారయ్యేవరకు మీరు వారికోసం చూస్తారా? అంతవరకు పెండ్లి చేసుకోకుండా వారికోసం ఒంటరిగా ఉంటారా? నా బిడ్డలారా, అలా కాదు. యెహోవా నాకు వ్యతిరేకంగా✽ తన చెయ్యి ఎత్తాడు. మీ పరిస్థితులకంటే నావి బాధకరంగా ఉన్నాయి.”
14 అందుకు వారు మళ్ళీ బిగ్గరగా ఏడ్చారు. ఓర్పా తన అత్తకు ముద్దు పెట్టుకొంది గాని, రూతు ఆమెను అంటిపెట్టుకొని ఉంది.
15 అప్పుడు నయోమి “చూడు! నీ తోడికోడలు ఆమె ప్రజల దగ్గరికి, ఆమె దేవుళ్ళ✽ దగ్గరికి తిరిగిపోతూ ఉంది గదా! నీవు ఆమె వెంట వెళ్ళు” అంది.
16 అందుకు రూతు ఇలా జవాబిచ్చింది: “నీవెంట రావద్దనీ, నిన్ను విడిచి వెళ్ళిపొమ్మనీ నన్ను ప్రాధేయపడకు. నీవు వెళ్ళే చోటికే నేనూ వస్తాను. నీవు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. నీ ప్రజలే నాకు ప్రజలుగా ఉంటారు. నీ దేవుడే నాకు దేవుడుగా✽ ఉంటాడు. 17 ✝ నీవు చనిపోయే స్థలంలోనే నేను చనిపోతాను. అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరేదీ నన్ను నీ దగ్గరనుంచి వేరుచేయదు. అలా కాకపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేస్తాడు గాక!”
18 తనతో రావడానికి రూతుకు దృఢ మనస్సు ఉండడం చూచి నయోమి ఇంకేమీ అనలేదు. 19 ✽ వారిద్దరూ బేత్‌లెహేం వరకు ప్రయాణం సాగించారు. వారు బేత్‌లెహేంకు చేరేసరికి వారిని చూచి ఊరిలో వారంతా కంగారుపడ్డారు. స్త్రీలు “ఈమె నయోమేనా?” అని చెప్పుకొన్నారు. 20 ఆమె “నన్ను నయోమి అనకండి. అమిత శక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు గనుక నన్ను ‘మారా✽ ’ అనండి. 21 నేను వెళ్ళిపోయినప్పుడు నాకు సమృద్ధి ఉంది. ఏమీ లేకుండా✽ నన్ను తిరిగి వచ్చేలా యెహోవా చేశాడు. మీరు నన్ను ‘నయోమి’ అని ఎందుకు పిలుస్తారు? యెహోవా నాకు విరుద్ధ సాక్షిగా నిలబడ్డాడు. అమిత శక్తిమంతుడు నామీదికి ఆపద✽ రప్పించాడు.”
22 ఆ విధంగా నయోమి మోయాబుదేశస్థురాలైన తన కోడలు రూతుతో కూడా మోయాబును విడిచి వచ్చింది. ఇద్దరూ యవల కోత ఆరంభించే సమయం✽ లో బేత్‌లెహేం చేరారు.
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 22, 2021
14 min

Life lessons to learn
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 21, 2021
7 min

న్యాయాధిపతులు 16
1 తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.౹
2 సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి.౹
3 సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను.
4 పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా
5 ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో–నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి.౹
6 కాబట్టి దెలీలా–నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా
7 సమ్సోను–ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.౹
8 ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.౹
9 మాటుననుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.౹
10 అప్పుడు దెలీలా–ఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా
11 అతడు–పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను
12 అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి— సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములోనుండిరి. అతడు తన చేతులమీదనుండి నూలుపోగునువలె ఆ తాళ్లు తెంపెను.౹
13 అప్పుడు దెలీలా–ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను.౹
14 అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను.౹
15 అప్పుడు ఆమె–నాయందు నీకిష్టము లేనప్పుడు —నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.౹
16 ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.౹
17 అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి–నేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.౹
18 అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి–యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమెయొద్దకు రాగా
19 ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీదియేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.౹
20 ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.౹
21 అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.౹
22 అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలుతిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను.
23 ఫిలిష్తీయుల సర్దారులు–మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి.౹
24 జనులు సమ్సో నును చూచినప్పుడు–మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి.౹
25 వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు–మనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 16, 2021
8 min

15
1 కొన్ని రోజులైన తరువాత, గోధుమ కోతకాలంలో సమ్సోను ఒక మేకపిల్లను తీసుకొని భార్యను చూద్దామని వెళ్ళాడు. అక్కడ “నా భార్య దగ్గరికి లోపలికి వెళ్తాను” అన్నాడు. కాని, ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.
2 “మీరు నిజంగా ఆమెను పూర్తిగా అసహ్యించుకొన్నారు అనుకొని నేను ఆమెను మీ స్నేహితుడికి ఇచ్చేశాను. ఆమె చెల్లెలు ఆమెకంటే అందమైనది గదా! ఆమెకు బదులు ఈమెను తీసుకోండి” అని ఆమె తండ్రి చెప్పాడు.
3 అప్పుడు వాళ్ళతో సమ్సోను “నేనీసారి ఫిలిష్తీయవాళ్ళ✽ కు ఏం కీడు చేసినా తప్పు ఉండదు” అన్నాడు.
4 సమ్సోను బయటికి వెళ్ళి మూడు వందల నక్కల✽ ను పట్టుకొన్నాడు. వాటిని జతజతలుగా చేసి వాటి తోకకు తోకను ముడివేసి కాగడాలు తెచ్చి, ఆ రెండు తోకల మధ్యన ఒక్కో కాగడా కట్టాడు. 5 అప్పుడు కాగడాలు వెలిగించి ఫిలిష్తీయ వాళ్ళ గోధుమ పంటచేలలోకి ఆ నక్కలను వదిలాడు. ఆ విధంగా పనలను, పైరును, ద్రాక్షతోటలను ఆలీవ్‌చెట్ల తోటలను తగలబెట్టాడు.
6 ఫిలిష్తీయవాళ్ళు “ఎవడురా ఇలా చేసినది? అని అడిగితే, ఎవరో ‘తిమ్నాతువాడి అల్లుడు సమ్సోను’. ఎందుకంటే, అతడి భార్యను అతడి స్నేహితుడికి ఇచ్చారు” అని తెలియజేశారు. అందుచేత ఫిలిష్తీయవాళ్ళు వెళ్ళి ఆమెను, ఆమె తండ్రిని నిప్పంటించి తగలబెట్టారు.
7 “మీరిలా చేశారు గనుక మీమీద పగతీర్చుకొనేదాకా నేను ఆగ✽ ను” అని సమ్సోను వాళ్ళతో అన్నాడు.
8 వెంటనే అతడు వాళ్ళపై విరుచుకుపడి భయంకరంగా వాళ్ళను చాలమందిని హతమార్చాడు. తరువాత అతడు వెళ్ళిపోయి ‘ఏతాం’ బండ గుహలో ఉండిపోయాడు.
9 అప్పుడు ఫిలిష్తీయవాళ్ళు బయలుదేరి యూదా ప్రదేశంలో లేహీ✽ దగ్గర వ్యాపించి మకాం చేశారు.
10 “మీరు మా మీదికి దండెత్తి వచ్చారెందుకు?” అని యూదావారు అడిగారు.
“మేం సమ్సోనును బంధించి, అతడు మాకు ఎలా చేశాడో మేమూ అతడికి అలాగే చేద్దామని వచ్చాం” అని ఫిలిష్తీయ వాళ్ళు జవాబిచ్చారు.
11 అప్పుడు మూడు వేలమంది✽ యూదావారు ఏతాం బండ గుహకు వెళ్ళి, సమ్సోనుతో ఇలా అన్నారు:
“ఫిలిష్తీయవాళ్ళు మనమీద అధికారులని✽ మీకు తెలీదా? మరి మీరు మా మీదికి ఏం తెచ్చి పెట్టారు?”
అందుకతడు “వాళ్ళు నాకెలా చేశారో నేనూ వాళ్ళకలా✽ చేశాను అంతే” అన్నాడు.
12 ✽ “మిమ్మల్ని కట్టి ఫిలిష్తీయవాళ్ళకు అప్పగించడానికి మేం వచ్చాం” అని వారు అతనితో చెప్పారు.
సమ్సోను “మీరు మాత్రం నన్ను చంపమని నాకు శపథం చేయండి” అన్నాడు.
13 వారు “సరే, నిన్ను గట్టిగా బంధించి వాళ్ళకు అప్పగిస్తాం గాని, చంపము” అని జవాబిచ్చారు.
అప్పుడు వారు అతణ్ణి రెండు క్రొత్త త్రాళ్ళతో బంధించి బండ దగ్గరనుంచి తీసుకువచ్చారు. 14 అతడు లేహీ సమీపంగా వచ్చేటప్పటికీ ఫిలిష్తీయవాళ్ళు కేకలు వేస్తూ అతడి దగ్గరికి వచ్చారు. యెహోవా ఆత్మ✽ బలంగా అతణ్ణి ఆవరించాడు. అతని చేతులకు ఉన్న త్రాళ్ళు కాలిపోయిన నారలాగా అయి పొయ్యాయి. అతని చేతుల మీదనుంచి కట్లు ఊడిపొయ్యాయి. 15 అక్కడ అతనికి గాడిద దవడ ఎముక పచ్చిది ఒకటి దొరికింది. అతడు దానిని చేతపట్టుకొని దానితో వెయ్యిమంది✽ ని హతమార్చాడు.
16 అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “గాడిద దవడ ఎముకతో వాళ్ళను కుప్పలుగా✽ కూల్చాను. గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపాను.”
17 అతడు అలా చెప్పి చేతిలో ఉన్న దవడ ఎముకను అవతల పారవేశాడు. ఆ స్థలానికి ‘రామాత్‌లేహి✽ ’ అని పేరు పెట్టాడు.
18 అప్పుడు అతనికి బాగా దప్పికయింది. “నీ సేవకుడైన నా చేతితో ఈ గొప్ప విడుదల✽ ప్రసాదించావు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతి పొందనివాళ్ళ చేతులకు చిక్కుపడాలా?” అని యెహోవాకు✽ ప్రార్థన చేశాడు.
19 అప్పుడు దేవుడు లేహిలో పల్లంగా ఉన్న స్థలాన్ని చీల్చాడు. దానిలోనుంచి✽ నీళ్ళు వచ్చాయి. సమ్సోను త్రాగి నప్పుడు అతనికి ప్రాణం తెప్పరిల్లింది, బలం వచ్చింది. అందుచేత దానికి ‘ఏన్‌హక్కోరె’ అని పేరు వచ్చింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.
20 ఫిలిష్తీయవాళ్ళ రోజులలో సమ్సోను ఇరవై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు.
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 15, 2021
4 min

సంసోను ఫిలిష్తీ యువతితో వివాహం
141 సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు. 2 అతడు ఇంటికి తిరిగి వచ్చి “తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని తన తల్లిదండ్రులను అడిగాడు. 3 వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు. 4 అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.
5 తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది. 6 యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
7 అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది. 8 కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి. 9 అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
10 సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు. 11 ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు. 12 అప్పుడు సంసోను వారితో “మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను. 13 ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి” అన్నాడు. దానికి వారు “ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.” అన్నారు.
14 అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు.
అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు. 15 ఏడవa రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.
16 సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది. 17 ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.
18 ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటేb నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు. 19 యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు. 20 సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.
---
Send in a voice message: https://anchor.fm/divyaveen/message
Jul 14, 2021
4 min
Load more
