TALRadio Telugu
TALRadio Telugu
Touch A Life Foundation
మైండ్‌సెట్ మార్చుకుంటే .. సక్సెస్ మీదే ! | Health Talk
19 minutes Posted Oct 21, 2026 at 6:53 am.
0:00
19:08
Download MP3
Show notes

మనసును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?


చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం.. ఇలాంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ, మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.


మరి మన రోజును ఎలా మొదలు పెట్టాలి? ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఒత్తిడిగా అనిపించినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా? అతిగా ఆలోచించే అలవాటును ఎలా తగ్గించుకోవాలి? సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలి? ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వారం TAL Health Talk కార్యక్రమంలో మనతో పంచుకున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ నేదిష్ట పావులూరి గారు!


మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికి తప్పక వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! మిస్ అవ్వకండి!


How can we keep our minds healthy, positive, and energetic?


Difficulty concentrating on work, feeling stressed over small things, overthinking, and comparing ourselves with others on social media are common challenges that affect our mental well-being. However, doctors suggest that making small changes to our daily habits can help improve our mental health.


How should we start our day? What techniques can improve concentration and memory? How can we stay calm during stressful situations, reduce overthinking, and use social media mindfully?


In this week’s TAL Health Talk, renowned psychologist Nedishta Pavuluri shares practical tips and valuable insights to help us build a healthier mind and lead a more balanced life.


Tune in to this insightful Podcast to learn simple ways to improve your mental well-being. Don’t miss it!


Guest : Pavuluri Nedista

Psychologist


Host : Kalyani



#TALRadioTelugu #MentalHealth #TALHealthTalk #MentalWellness #Psychology #HealthyMind #TouchALife #TALRadio