TALRadio Telugu
TALRadio Telugu
Touch A Life Foundation
TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.
Saying No Is A Luxury - ఓ మంచి మాట - 5
అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని ఓ సామెత. చాలా సందర్భాల్లో మొహమాటంతోనో, జరగబోయే పని మీద అవగాహన లేకనో ముందుగానే తలాడించేస్తాం. తీరా ఒకో అడుగూ వేయలేక, ముందుకు పడక సతమతమవుతాం. లక్ష్యంతో పాటుగా విలువైన బంధాన్నీ కోల్పోతాం. అందుకే ఇప్పటి రోజుల్లో కుదరదు, వద్దు, కాదు, లేదు అని చెప్పడం కూడా కళగా భావిస్తున్నారు. ఈ విషయమై మరింత విశ్లేషణ, విలువైన సూచనలు అందిస్తున్నారు మన హోస్ట్ భారతిగారు. We often say yes to everything we are offered and we encounter. Giving our consent might be due to obligation or misinterpretation… but it would often lead to unpleasant consequences. Saying yes and failing thereafter might not only result in disappointment but also stressed relations. Here is an interesting analysis by our host Bharati about the art of saying NO. #talradiotelugu #omanchimata #Bharati #touchalife #talradio #talpodcasts
Apr 5, 2024
11 min
ఆర్థరైటిస్ కి ఆహార నియమాలు! | Know Your Plate - 35
ఆర్థరైటిస్ అనేది కీళ్ళకి సంబంధించిన ఒక వ్యాధి. ఇందులో రెండు రకాలుంటాయి. ఈ వ్యాధి ఒకసారి వస్తే పూర్తిగా తగ్గిపోవడం అనేది సాధారణంగా జరగదు. ఐతే సరైన ఆహార నియమాలతో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు, లేనివారికి రాకుండా కూడా జాగ్రత్తపడవచ్చు. ఈ విషయాలన్నీ మన ఆశ్రిత గారి మాటల్లో తెలుసుకుందాం.. Host: Jayaree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #knowyourplate #arthritis #AsrithaVissapragada #trulynurtition #jayasree #touchalife #talradio
Apr 5, 2024
29 min
కథకు ఓ ప్రయోజనం ఉండాలి! బద్రి కూర్మారావు | మన రచయితలు 49
వారం వారం విశిష్టమైన రచయితలతో జరుగుతున్న పరిచయంలో భాగంగా జానపద కళలు, సాహిత్యాలను ప్రచారం చేస్తున్న బద్రి కూర్మారావుగారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. గత వారం తను జానపద కళల పట్ల ఆకర్షితులైన నేపధ్యం, వాటిని తన వ్యాసాల ద్వారా ప్రచారం చేస్తున్న తీరు చెప్పారు కూర్మారావుగారు. ఇక ఈ ఎపిసోడ్లో తను కథలు రాయడం వెనకాల ఉన్న స్ఫూర్తి, తన ప్రయాణం, కళాపీఠాల ద్వారా చేస్తున్న సేవ లాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలను పంచుకోబోతున్నారు. Here is the second part of the interview with renowned folk research scholar Badri Kurma Rao. After sharing some interesting details in the previous week about his fascination towards folk tradition and literature, Kurma Rao shares more about his long journey, work done through his cultural organizations and the inspiration behind his story writing. #talradiotelugu #manarachayitalu #BadriKurmarao #talpodcasts #KLSurya #touchalife #talradio
Apr 4, 2024
28 min
"ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని మరింత ఎదిగేలా చేస్తుంది " - కవిత గూడపాటి | విజేత - 4
విశిష్టమైన వ్యక్తులను పరిచయం చేసే విజేత సిరీస్లో భాగంగా ప్రముఖ సైకాలజిస్ట్‌ కవిత గూడపాటి గారితో మాట్లాడబోతున్నాం. కుటుంబ వ్యాపార సలహాదారుగా, లీడర్ షిప్‌ కోచ్‌ గా, మార్గదర్శిగా తను ఎన్నో సమస్యలకు పరిష్కారాలందించారు. ఎన్నో సవాళ్లను అధిగమించేలా చేశారు. మరి తన సమస్యల్ని ఎలా దాటారు, తన నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, సవాళ్ల గురించి తన అభిప్రాయం ఏమిటి… లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు ఈ సంభాషణ వినేద్దాం. Dr.Kavitha Gudapati is renowned Organizational Psychologist, Family Business Advisor and a Leadership Coach. Her support and suggestions have impacted many lives for better. Here is an interesting conversation on how she overcame her own challenges and her take on hurdles in life. Host : Rama Iragavarapu Guest : Dr.Kavitha Gudapati #talradiotelugu #vijetha #kavithagudapati #ramairagavarapu #touchalife #talradio #talpodasts
Apr 2, 2024
42 min
దీప్తి ఆకెళ్ల… తన పేరే ఒక బ్రాండ్! | TALent - 2
వారం వారం విశిష్టమైన వ్యక్తులను పరిచయం చేస్తున్న TALent సిరీస్లో భాగంగా మరో విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం. సోషల్‌ ఇన్‌ ఫ్లూయన్సర్‌ గా దీప్తి ఆకెళ్ల పేరు చాలామందికి పరిచయమే. తన ఫుడ్‌ వ్లాగ్స్ ద్వారా వేలమంది అనుచరులనే సంపాదించుకున్నారు. ఇక తన సంస్థ పికిల్స్‌ అండ్‌ పొడిస్ గత ఎనిమిదేళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. మరి తన ప్రయాణం, ప్రయత్నం వెనుక ఉన్న స్ఫూర్తిని తెలుసుకుందామా! Here is yet another interesting part in our series of TALent. We are going to converse with Deepthi Akella renowned influencer and entrepreneur. Her food vlogs have gathers thousands of followers and her Pickles and Podis is successfully running for over eight years making its unique mark in the food industry. Here is her journey and efforts for our listeners. Host : RJ Lucky Guest : Deepthi Akella #talradiotelugu #TALent #DeepthiAkella #WomenEmpowerment #TouchALife #TALRadio #TALPodcast
Apr 1, 2024
33 min
How to Control Anger | ఓ మంచి మాట - 4
కోపం ఓ విషవలయం. అది మనసును పాడుచేస్తుంది, బంధాలను దెబ్బతీస్తుంది. చాలా సందర్భాల్లో, జీవితాల్ని తారుమారు చేసేస్తుంది. అలాగని కోపాన్ని నియంత్రించుకుందాం అంటే… మన ఉద్వేగాన్ని తెలిపేది ఎలా! అందుకే Anger Management అన్నది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన నైపుణ్యంగా మారిపోయింది. కోపం అనే ఉద్వేగపు మూలాన్ని తెలుసుకుని, దాన్ని కంట్రోల్‌ చేసుకోవడం ఎలాగో చెబుతున్నారు మన ఎక్స్‌ పర్ట్‌ భారతిగారు. విని తీరాల్సిన మాటలివి. Anger is a primary emotion that reveals our dissent or dissatisfaction about a person or a situation. However unable to control anger could lead to destructive results which is why anger management has become an important skill in today’s world. Our expert Bharathi is sharing some interesting analysis about anger and tips to control it. #talradiotelugu #angermanagement #anger #talpodcasts #bharathi #touchalife #talradio
Mar 29, 2024
9 min
నిద్ర - ఆహారం | Know Your Plate - 34
మనం తీసుకునే ఆహారానికీ, నిద్రకీ కచ్చితమైన సంబంధం ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని ఆహార పదార్థాలు మన నిద్రను దూరం చేస్తే, మరికొన్ని గాఢనిద్రను అందిస్తాయి. ఇది కేవలం నమ్మకమో, సంప్రదాయ వైద్యం చెప్పిన మాటో కాదు… సైన్స్‌ చేస్తున్న సూచన. ఇప్పటి తరం రోజువారీ ఒత్తిడి, సమస్యల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం నిద్ర. దాన్ని కాపాడుకునేందుకు తగిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో సూచిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు ఆశ్రితగారు. The correlation between food and sleep is well known to our elders and this belief is ratified by science. Some foods trigger insomnia and some would result in deep sleep. Here is an interesting episode which shares some fascinating and useful details about the food to be taken for better sleep. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #asritha #sleepquality #insomnia #touchalife #talradio
Mar 29, 2024
24 min
కళలను అక్షరాలతో బతికించే ప్రయత్నం! | బద్రి కూర్మారావు | మన రచయితలు - 48
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బద్రి కూర్మారావు తన వ్యాసాల ద్వారా చాలామందికి పరిచయమే. చిన్నప్పుడు తను చూసిన జానపద కళలు క్రమంగా అంతరించిపోవడం చూసి అందరిలా బాధపడుతూ ఊరుకోలేదు. కాలంతో సహజమే అని సర్దుకోలేదు. తన వంతుగా ఏం చేయవచ్చా అని ఆలోచించారు. వ్యాసాలు, పుస్తకాలు, కళాపీఠాలు… ఇలా ఎన్నో విధాలుగా జానపద కళలను ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు జానపద కథలను సేకరిస్తూ, సామాజిక సమస్యల మీద కథలు రాస్తూ సాహిత్యానికి గొప్ప విలువను కల్పిస్తున్నారు. ఈ అరుదైన సాహితీవేత్తతో ఈవారం మన రచయితలు కార్యక్రమం. Badri Kurma Rao is an interesting writer who doesn’t just write for his or readers satisfaction. Kurma Rao has been relentlessly using the form of writing to create awareness about the folk art, stories and songs. His stories do have a purpose. They depict the social issues around him. Here is a thought provoking conversation with Kurma Rao. Host : K L Surya #TALRadioTelugu #ManaRachayitalu #BadriKurmaRao #touchalife #talradio #TALPodcast
Mar 28, 2024
21 min
మలుపులే మజిలీలు విలువలే విజయాలు | రమేష్‌ కుమార్‌ షా - Part 2 | విజేత - 3
ప్రముఖ పారిశ్రామికవేత్త రమేష్‌ కుమార్‌ షాగారితో టాల్‌ జరిపిన సంభాషణలోని రెండో భాగమిది. తను వ్యాపారంలో విజయం సాధించడం వెనుక ఉన్న అసాధారణ ప్రయాణాన్ని ఇందులో పంచుకుంటున్నారు. అవకాశాలను వెతుక్కుతూ దూరతీరాలకు చేరడం, ప్రతి రంగంలోనూ తొలి అడుగులు వేయడం లాంటి రహస్యాలను మనకు చెబుతున్నారు. సమాజం పట్ల ఓ పౌరునిగా, వ్యాపారస్తునిగా తన బాధ్యతను ఎలా నిర్వర్తించారో కూడా మనం వినవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆదుకునే ప్రయత్నమూ గమనించవచ్చు. Here's a captivating dialogue with Ramesh Kumar Shah, a seasoned entrepreneur and angel investor who co-established and co-leads HBS Angels India, the premier network of Harvard alumni investors in India. Additionally, he is the visionary behind RK Group, a thriving conglomerate. Ramesh is deeply committed to nurturing and guiding budding entrepreneurs, while also actively participating in philanthropic endeavors as part of his social responsibility. Host : Rama Iragavarapu #TALRadioTelugu #Vijetha #RameshKumarSha #RKGroup #TALRadio #TouchALife #TALPodcast
Mar 26, 2024
30 min
రైతుగా మారి… వ్యాపారిగా ఎదిగి. ఇది ఓ ‘విజయ’గాథ! | Special Interview
స్త్రీపురుషులు ఇద్దరూ సమానమే అయినా, ఇప్పటికీ కనిపించని ఓ వివక్ష ఉంటుంది. మహిళల్ని పొలంలో కూలీలుగా అంగీకరించే సమాజం, వారిని రైతులుగా గుర్తించదు. ఈ పరిమితులు దాటి ఆదర్శ రైతుగా నిలదొక్కుకున్నారు విజయ. ఎవరు ఎన్ని మాటలన్నా, సేంద్రియ వ్యవసాయంలో అరుదైన విజయాలు సాధించారు. ఒంటరి మహిళగా, తన కాళ్ల మీద నిలబడ్డారు. అక్కడితో ఆగలేదు. తన వ్యాపార దక్షతతోనూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏ రంగంలో అయినా విజయం సాధించాలనుకునే యువతకు ఆదర్శంగా మారారు. ఈ అరుదైన వ్యక్తితో సంభాషించే ప్రయత్నం చేసింది టాల్‌ రేడియో. Women are often underestimated in many fields and agriculture is one of them. Despite recognizing them as agricultural labourers, many won’t expet them to succeed as farmers. Vijaya has not only proved them wrong but also succeeded in her organic farming. Here is the story of a brave woman who fought against all odds and turned into an inspiration for the rest. Host: RJ Lucky #talradiotelugu #touchalife #talradio #talent #vijayafarmer #womanfarmer #organicfarming
Mar 25, 2024
36 min
Load more