
ఆహారం కేవలం ఆకలి తీరే మార్గం కాదు. బలాన్ని అందించడమే దాని ఉపయోగం కాదు. మనం తీసుకునే ఆహారం మన శరీరం మీదా, మనసు మీదా ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఆన్ లైన్ ఆర్డర్లు ఓ అలవాటుగా మారుతున్న నేటి కాలంలో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరుగుతోంది. ఓ సౌలభ్యంగానో, సౌకర్యంగానూ ఉన్న ఈ అలవాటు వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకుందాం. అంతేకాదు. ఒక రోజును మొదలుపెట్టడం నుంచి సరైన రీతిలో ఆహారం ఎలా ఉండాలో విందాం! ఆహారం ఓ ఔషధం అనే పెద్దల మాటను గుర్తుచేసుకుందాం.
Food is not just a means to satiate hunger. Its purpose is not merely to provide strength. The food we consume has a definite impact on our body and mind. In today's era, where online orders have become a habit, we must remember this fact. So, where is the mistake happening? What is the harm caused by this convenient habit? Let's explore these aspects. Moreover, let's learn how to start a day with the right kind of food! Let's remember the elders' saying that food is medicine
Host : Bharathi
#TALRadioTelugu #Bharathi #onlinefood #foodandhealth #nutrition #touchalife #talradio #talpodcasts
May 31, 2024
14 min

కాకి అనే ఊరి పేరు వినిపిస్తే… కాస్త హాస్యంగా తోస్తుంది. కానీ దాని వెనకాల ఓ ఆశ్చర్యకరమైన కథ ఉందని తెలిస్తే. దీర్ఘాసి లాంటి ఊరి పేర్ల వెనక గొప్ప చరిత్ర కనిపిస్తే! మనం గమనించాలే కానీ ప్రతీ ఊరి పేరూ ఓ కథ చెబుతుంది. ప్రతి గ్రామనామం వెనకా అబ్బురపరిచే విశేషమేదో ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయం, వాతావరణం, జీవనశైలి, పశుపక్ష్యాదులు… ఇలా ఓ ఊరి పేరు వెనుక ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. వీటిని పరిశోధించి, గ్రంథస్తం చేయడమే తన వ్యాపకంగా అలవర్చుకుని అందులో అరుదైన ప్రయాణం చేస్తున్నారు వాండ్రంగి కొండలరావుగారు. ఆయనతో మన రచయితలు కార్యక్రమం!
Toponymy is rare subject that deals with names of places. Toponymy believes that every name is unique and has a history hidden behind it. Vandrangi Kondalrao who is a teacher by profession and journalist by passion has started a unique journey in Toponymy and is making commendable impact.
Host : K L Surya
#TALRadioTelugu #manarachayitalu #vandrangikondalrao #touchalife #talradio
May 30, 2024
27 min

మల్లికార్జున్… కాలేజి రోజుల్లో స్నేహితులతో కలిసి స్వచ్ఛంద సేవ చేసేవారు. చదువు అయిపోయినా, కెరీర్ మొదలైనా… ఇతరులకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తిని మర్చిపోలేదు. SERUDS పేరుతో కర్నూలులో వృద్ధులు, పిల్లలు, మహిళలు… ఇలా అన్ని రంగాలవారికీ అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడమే కాదు, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలాగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు అయిదు వేల కుటుంబాలు ఈ సంస్థ వల్ల ప్రభావితం అయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ అరుదైన వ్యక్తినీ, తన ప్రయాణాన్ని వినేద్దాం.
Here is a conversation with Mallikarjun, Founder of SERUDS- Sai Educational Rural & Urban Development Society based in Kurnool District. SERUDS has been relentlessly striving to help the needy women, children and elders. It is not only providing them, much needed care but also supporting them in building their own livelihood. It is estimated that SERUDS has impacted almost 5000 families. Here is its inspiring journey.
Host : K L Surya
#TALRadioTelugu #SpoorthiKiranalu #MalliKarjun #Inspiring #SERUDS #touchalife #talradio #talpodcasts
May 27, 2024
27 min

Tongue thrusting అనే సమస్య అసలు మనకి ఉందని కూడా చాలామందికి తెలియదు. ఐతే ఈ సమస్య వల్ల ఇంకా బోలెడన్ని నోటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మరింత వివరంగా తెలుసుకుందాం Dr. హరీష్ తెన్నేటి గారి నుండి, ఈ వారం సంచికలో!
Tongue thrusting is an oral issue that most of us fine even know we are experiencing this. This may lead to many more oral and other health problems if left untreated. Know more about Tongue thrusting from Dr. Harish Tenneti in this week’s episode!
Host: Jayasree
Expert: Dr.Harish Tenneti
Dr. Harish Contact Details:
Mobile number: 9182674723
Website:https://www.violetera.in/
#TALRadioTelugu #DenTALCare #TongueThrusting #OralHealth #DentalHealth #TouchALife #TALRadio #TALPodcast
May 25, 2024
30 min

చాలా మురికిగా దుర్గంధభూరితంగా ఉన్న గదిలోకి మీరు అడుగుపెట్టారే అనుకోండి… అక్కడ మీకు ప్రశాంతత దక్కుతుందా. చింపిరి జుట్టుతో, నోటి దుర్వాసనతో ఉన్న వ్యక్తిని మొదటిసారి కలిశారే అనుకోండి… తన మీద మీకు సదభిప్రాయం కలుగుతుందా! స్పష్టంగా లేదనే జవాబు చెబుతాం కదా. ఎందుకంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, మన మనసు మీద తెలియకుండానే ప్రభావం చూపిస్తాయి. పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి ఆహ్లాదం కలిగిస్తాడు. ఇది డబ్బుకో, స్తోమతకో సంబంధించిన విషయం కాదు. మన అలసత్వాన్ని, అశ్రద్ధను బయటపెట్టే అంశం. చాలా చిన్న విషయమే. కానీ చాలా ప్రభావం చూపించే కారణం. అందుకే ఈ వారం మంచి మాటలో… ఈ విషయం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు
Imagine stepping into a filthy, foul-smelling room... Would you feel at peace there? Or meeting someone for the first time who has unkempt hair and bad breath... Would you have a good impression of them? Clearly, the answer is no. This is because our surroundings subtly affect our mind. A clean person creates a pleasant atmosphere. This isn't about money or status; it's about revealing our laziness and negligence. It's a small matter but has a significant impact. That's why, in this week's Good Word segment, our expert Bharati will share more interesting insights on this topic.
Host : Bharathi
#TALRadioTelugu #CleanlinessMatters #FirstImpressions #MindfulLiving #ExpertAdvice #TALRadio #TALPodcast
May 24, 2024
9 min

మన పెద్దలు ఆహారాన్ని ఔషధంగా భావించేవారు. అంతే నిబద్ధతతో వంట చేసే పద్ధతి ఉండేది. కానీ కాలం మారిపోయింది. మనం వాడే నూనెలు, వేయించే తీరు, పాత్రలు… అన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చేశాయి. దీని వల్ల ఔషధం సంగతి పక్కన పెడితే, మనం తినే ఆహారమే అనేక అనారోగ్యాలకు దారి తీస్తోందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మనం తినే పదార్థాలలోని పోషకాలు ఒంటికి అందేలా, పద్ధతిగా ఎలా వండాలో చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడగారు.
Our elders used to consider food as medicine. Truly so! What we eat is what makes us. However, with changing lifestyle, the way we are cooking our food has definitely changed. From the temperature of cooking to utensils used in the process, every thing has changed. Here is a way to get back to the basics. Let’s listen the perfect way of cooking to retain the nutrients and provide health us… from renowned nutritionist Asritha Vissapragada.
Host: Jayaree
Expert: Asritha Vissapragada
Nutritionist Asritha Contact Details: [email protected]
#TALRadioTelugu #KnowYourPlate #NutritionShow #touchalife #talradio #talpodcasts
May 24, 2024
31 min

మన రచయితలు సిరీస్లో భాగంగా మనం దేవులపల్లి పద్మజగారితో మాట్లాడుతున్నాం. కథ, కవిత్వం, సమీక్ష, గేయం, వ్యాసం… ఇలా అన్ని సాహితీ ప్రక్రియల్లో ప్రేవశం ఉన్న పద్మజగారు మంచి ఉపాధ్యాయురాలు కూడా. అందుకే ఈ వారం అటు భాష, ఇటు సాహిత్యం రెండింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది టాల్. చాలామందికి నిస్సారంగా అనిపించే వ్యాకరణం వల్ల అసలు ఉపయోగం ఉందా, తను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, విద్యార్థులు భాష మీద పట్టు రావాలంటే ఏం చేయాలి… లాంటి ఆసక్తికరమైన జవాబులకు సమాధానాలు వినబోతున్నాం.
Here is the second part of our conversation with Devulapally Padmaja a writer who is proficient in various fields of literature in fiction as well as non fiction. Padmaja is going to reveal some interesting opinions regarding the importance of grammer and means to get hold on language.
Host : K L Surya
#TALRadioTelugu #Devulapally #ManaRachayitalu #TeluguLiterature #touchalife #talradio #talpodcasts
May 23, 2024
21 min

కరాటే అంటే ఆత్మరక్షణ కోసం నేర్చుకునే విద్య అని చాలా మంది నమ్మకం. కానీ దామోదర్ నాయక్ గారిని కదిపితే కరాటేతో ఉన్న చాలా ఉపయోగాలు చెబుతారు. ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం లాంటివన్నీ కరాటేతో అలవాడతాయని అంటారు. ఈ విద్యను నమ్మి ఊరుకోలేదు. దాన్ని అందరికీ ఉచితంగా అందించే ప్రయత్నంలో ఉన్నారు దామోదర్. పేద విద్యార్థులకు ఈ విద్యను అందిస్తే… వారి భవితను తీర్చిదిద్దడంలో అది సాయపడుతుందని నమ్ముతూ వందల మందికి కరాటేను నేర్పుతున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని, వనరులను పణంగా పెట్టా సమాజం కోసం పాటుపడుతున్న ఈ అరుదైన వ్యక్తితో టాల్ సంభాషణ ఇది.
What is Karate for! Many answer with question by mentioning self defense. However Mr. Damodar Nayak believes that Karate isn’t just a martial art of defence. He asserts that it inculcates a lot of valuable traits such as discipline, hardwork, determination and self confidence… which is the reason why he is teaching Karate to numerous kids at free of cost. Here is an inspiring conversation with him.
Host : K L surya
#TALRadioTelugu #KarateTeacher #DamodarNayak #sphurtikiranalu #touchalife #talradio #talpodcasts
May 20, 2024
32 min

మన చేతికి ఉండే ఐదు వేళ్లే ఒకలాగ ఉండవు.. అలాంటిది ప్రతి ఒక్కరి స్వభావం ఒకేలాగ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు ఒకరి సమస్య ఒకరికి చాలా తేలికగా కనిపిస్తే.. మరొకరికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలానే కొంతమంది తమకు వచ్చిన కష్టాన్ని బయటకు చెప్పుకుంటే.. కొంతమంది తమలో తాము అణుచుకుంటారు తప్పా బయటకు చెప్పలేరు. అంతేకాదు ఇతరుల బాధలను ఓపికగా విని సలహా ఇచ్చేవారు కూడా ఉంటారు. అయితే ఇలా సలహాలు ఇచ్చేటప్పుడు కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి అంటున్నారు నిపుణులు.. మరి ఇతరుల విషయంలో మన సలహా ఎలా ఉండాలి.. ఎంత వరకూ ఇతరుల విషయాల్లో చొరవ తీసుకోవాలి.. మనం ఉపకారం చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు ఈ పోడ్కాస్ట్ లో చక్కగా వివరించారు.
When counseling or advising others, remember to listen attentively, show empathy, and respect confidentiality. Offer practical, constructive advice without imposing personal biases. Maintain a non-judgmental attitude, validate their feelings, and empower them to make their own decisions. Follow up to provide ongoing support and encouragement. You can find many helpful tips in this podcast.
Host : Bharathi
#TALRadioTelugu #OManchiMata #Advise #Counseling #TouchALife #TALRadio #TALPodcast
May 17, 2024
12 min

ఓ చిన్న ప్రోత్సాహం, వ్యక్తి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది? ఓ సూచన తన భవిష్యత్తును ఎలా మార్చేస్తుంది? సంస్కృతం రాజభాష మాత్రమే అన్న మాటలో నిజం ఎంత? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన జవాబు దొరికే సంభాషణ ఇది. రచయిత్రితో పాటుగా తెలుగు, సంస్కృత భాషల్లో ఉపాధ్యాయురాలైన దేవులపల్ల పద్మజగారితో ముఖాముఖిలో విందాం. భావ కవిత్వపు గొప్పదనం నుంచి ఓ మంచి రచనకు ఉండాల్సిన లక్షణం వరకు ఎన్నో ఆసక్తికరమైన కబుర్లు ఈనాటి మన రచయితలు పాడ్ కాస్టులో!
Here is yet another interesting episode of Mana Rachayitalu introducing promising writers to the listeners. Devulapally Padmaja is a unique writer who has made her own mark in many fields of literature such as story, poetry and criticism. She is also a lecturer in Telugu and Sanskrit. Here is her valuable expertise and opinions on various aspects of literature.
Host : K L Surya
#TALRadioTelugu #manarachayitalu #devulapally #touchalife #talradio #talpodcasts
May 16, 2024
22 min
Load more
