Pothubari Lakshmana Rao
Pothubari Lakshmana Rao
Pothubari Lakshmana Rao
Personal Interviews and poetries
నావి-నీవి -లక్ష్మణ్ రావ్
విజయనగరం జిల్లా లో మొట్టమొదటిగా నానీలు రాసి జిల్లాకు పరిచయం చేసింది నేను. నావి-నీవి పేరుతో నానీలు సంపుటి కూడా ముద్రించాను.విజయనగరంలో డాక్టర్ ఎన్.గోపి గారి ద్వారా ఆవిష్కరించాను.ఈ కార్యక్రమానికి అనకాపల్లి నుండి డాక్టర్ తలతోటి పృధ్విరాజ్ కూడా హాజరయ్యారు. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. పృథ్వీరాజు ప్రోత్సాహంతో రెండు హైకూ సంపుటాలు కూడా రచించి ముద్రించాను. విజయనగరం జిల్లాకు హైకూలు,రెక్కలు కూడా నేనే పరిచయం చేసాను. నేను రాసిన నానీలకు తన విలువైన వ్యాఖ్యానం జోడించి ఇండియన్ హైకూ క్లబ్ ద్వారా ఒక సీడీని రూపొందించారు మిత్రుడు పృధ్విరాజ్. గంటకు పైగా సీడీ నిడివి వుంటుంది. రమారమి నేను రాసిన అన్ని నానీలకు ఓపికగా వ్యాఖ్యానం మరియు గళం అందించిన మిత్రునికి సదా కృతజ్ఞతలు. మీరు కూడా విని ఆనందించండి మరియు ఆలోచించండి నా నానీలపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. -లక్ష్మణ్ రావ్
Apr 1, 2020
1 hr 5 min
టోరీ రేడియో ప్రసంగం
కేవలం ఒక సిద్ధాంతానే నమ్ముకుని, ఆ సిద్ధాంతం ఆధారంగా వచ్చిందే సాహిత్యం అని సాహిత్య పరిథిని కుచింప చేస్తూ, సాహిత్య వైశాల్యాన్ని, విస్తృతి విస్మరించి, తాము తమవారే రచయితలు, మిగతావారు రాసేది సాహిత్యం కాదనే తెలుగు సాహిత్య డింపతులందరిపై సాహిత్యాస్త్రాలు ఎక్కుపెట్టి, పలు విభిన్నప్రక్రియల్లో, విశిష్టమయిన రీతిలో రచనలు చేసి, ఇది సాహిత్యం కాకపోతే ఇంకేమిటి సాహిత్యం అని డింపతులందరినీ, నిలదీస్తున్న కవి లక్ష్మణ రావు. కవులు, కబుర్లు చెప్తారు తప్ప, కార్య శూరులు కాదన్నది తప్పని నిరూపిస్తూ కార్య శూరిడిగా నిలుస్తూ, సాహిత్య మాఫియాముఠాలపై తిరుగుబాటు చేస్తున్న సాహిత్య విప్లవకారుడి సృజనస్వరం రేపు రాత్రి టోరీ రేడియోలో వినండి..అతని సాహిత్య సేవను గురించి తెలుసుకోండి. ఇంకా ఎన్నెన్ని ఇలాంటి విప్లవ స్వరాలను మన సాహత్య పేజీలు నొక్కిపెడుతున్నాయో ఊహించండి.
Apr 1, 2020
1 hr