Srini's EDU Podcast
Srini's EDU Podcast
Srinivas Nissankula
Vennela Lesson 5 | వెన్నెల పాఠ్యభాగం 5 | 10th Class Telugu | Season 4 | Episode 49 | Srini's EDU Podcast
2 minutes Posted Jan 1, 2022 at 3:04 pm.
0:00
2:47
Download MP3
Show notes

Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల)

In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana "Vadigoni Rekuluppatila" (వడిగొని ఱేకులుప్పతిల)

వడిగొని ఱేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు

ప్పొడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జెలంగి పైఁ

బడు నెలదేఁటిదాఁటులకుఁ బండువులై నవసౌరభంబు లు

గ్గడువుగ నుల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.

పదవిభాగం:

వడి+ కొని, ఱేకులు, ఉప్పతిలన్, వాలిన కేసరముల్, తలిర్పన్,

పుప్పొడి, తలము + ఎక్కి, తేనియలు, పొంగి, తరంగలున్ + కాన్, చెలంగి,

పైన్+ పడున్, ఎలదేటిదాటులకన్, పండువులు + ఐ, నవసౌరభంబులు,

ఉగ్గడువుగన్, ఉల్లసిల్లెన్, ఘనకైరవషండము, నిండువెన్నెలన్.

ప్రతిపదార్ధము:

నిండువెన్నెలన్= నిండు వెన్నెలలో

ఘనకైరవషండము= శ్రేష్ఠమైన తెల్ల కాలువ పూల సమూహము యొక్క

ఱేకులు= పూల రేకులు

వడి+ కొని = వేగం పొంది

ఉప్పతిలన్= విచ్చుకొనగా

వాలిన కేసరముల్ = క్రిందికి వాలిన తమర పూవులో ఉన్న కేసరములు

తలిర్పన్= చిగురించగా

పుప్పొడి= పూవు నందలి పొడి

తలము+ ఎక్కి = మునిగేవరకూ

తేనియలు= మకరందాలు

పొంగి= పొంగి పొరలి

తరంగలున్+ కాన్ = అలలుగా

చెలంగి= విజృంభించి

పైన్+ పడున్ = కలువపూలపై వాలెటటువంటి

ఎలదేటిదాటులకన్= లేత తుమ్మెదల సమూహమునకు

పండువులు+ ఐ = పండుగను చేస్తూ

నవసౌరభంబులు= కొత్త పరిమళాలతో

ఉగ్గడువుగన్= అధికముగా

ఉల్లసిల్లెన్= ప్రకాశించాయి

భావం:

నిండు వెన్నెలలో శ్రేష్ఠమైన తెల్ల కాలువ పూల సమూహము యొక్క పూల రేకులు వేగం పొంది విచ్చుకొనగా క్రిందికి వాలిన తమర పూవులో ఉన్న కేసరములు చిగురించగా పూవు నందలి పొడి మునిగేవరకూ మకరందాలు పొంగి పొరలి అలలుగా విజృంభించి కలువపూలపై వాలెటటువంటి లేత తుమ్మెదల సమూహమునకు పండుగను చేస్తూ కొత్త పరిమళాలతో అధికముగా ప్రకాశించాయి.

---
Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message